హైదరాబాద్‌లో తీవ్ర ఉద్రిక్తతల మధ్య కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్ట్ చేశారు. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జాగృతి నేతలతో కలిసి నాంపల్లి సింగరేణి భవన్‌ను ముట్టడించే ప్రయత్నం చేయగా.. పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ పోలీసులు, జాగృతి నేతలు, కార్యకర్తలకు తీవ్ర వాగ్వాదం.. తోపులాట జరిగింది. దీంతో కవిత సహా జాగృతి నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు.. వారిని నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.