కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ.. సెక్యులర్లు, మావోయిస్టు సానుభూతిపరులకు ఆహ్వానం..

2 months ago 6
తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కన్నీరు పెట్టుకున్నారు. బీఆర్ఎస్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని, ప్రశ్నిస్తే కక్షగట్టారని, తనను ఘోరంగా అవమానించిందని ఆరోపించారు. ఈడీ, సీబీఐ పోరాటంలో అండగా నిలవలేదని, కేసీఆర్ పై అక్కసుతోనే బీజేపీ తనను జైలులో పెట్టించిందని విమర్శించారు. ఆ తర్వాత గన్‌పార్కు వద్ద మాట్లాడిన కవిత.. రాష్ట్రంలో కొత్త రాజకీయ శక్తిగా తెలంగాణ జాగృతి ఎదుగుతుందని స్పష్టం చేశారు. తనకు మద్దతివ్వాలని మైనార్టీలు, సెక్యులర్లు, మావోయిస్టు సానుభూతిపరులు, యువత, నిరుద్యోగులకు విజ్ఞప్తి చేశారు.
Read Entire Article