తెలంగాణ గడ్డపై మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత సొంత పార్టీని ఏర్పాటు చేశారు. మునీరాబాద్ అద్వయ కన్వెన్షన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన సభలో పార్టీ పేరు , జెండాను కవిత ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర సేన అంటే టీఆర్ఎస్ అనే అర్థం వచ్చేలా పార్టీ పేరును పెట్టడం గమనార్హం. పార్టీ జెండాలో పేరు కింద అసోసియేషన్ అనే పదాన్ని చేర్చడం ప్రస్తుతం చర్చనీయం అవుతోంది.