తెలంగాణ మంత్రి కొండా సురేఖ సచివాలయంలో స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. లోబీపీ కారణంగా ఆమె కేబినెట్ హాల్‌లో కళ్ళు తిరిగి పడిపోయారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన నేడు జరిగే కేబినెట్ భేటీలో రాజీవ్ యువ వికాసం అర్హుల పరిశీలన.. వానాకాలం పంటలు, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి, కాళేశ్వరం నివేదికలు, ఉద్యోగుల సమస్యలు, వేములవాడ కోడెల మృతి వంటి కీలక అంశాలపై చర్చించనున్నారు.