కల్వకుంట్ల కవిత తెలంగాణ రాష్ట్ర సేన (TRS) పార్టీని ప్రకటించడం ద్వారా పరోక్షంగా బీఆర్ఎస్ పార్టీకి సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పేరు మార్పుతో దూరమైన 'తెలంగాణ సెంటిమెంట్'ను తన వైపు తిప్పుకోవడమే లక్ష్యంగా ఆమె TRS అనే పేరును ఎంచుకున్నారు. అయితే పార్టీ పేరు కంటే ఆమెకు దక్కబోయే ఎన్నికల గుర్తుపైనే ఇప్పుడు ప్రధాన చర్చ సాగుతోంది. గతంలో కారు గుర్తును పోలిన గుర్తుల వల్ల భారీగా నష్టపోయిన బీఆర్ఎస్‌కు.. ఇప్పుడు కవిత పార్టీకి కారును పోలిన గుర్తు దక్కితే అది కోలుకోలేని దెబ్బ అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.