ఆదివాసీల సమస్యలను పరిష్కరించి, వారికి ఇళ్లు, స్థలాలు, మౌలిక వసతులు కల్పించిన జిల్లా కలెక్టర్లకు గిరిజనులు వినూత్నంగా కృతజ్ఞతలు తెలిపారు. ఆదిలాబాద్ పాత చించుఘాట్‌లో అప్పటి కలెక్టర్ దివ్యదేవరాజన్ చొరవతో ఐదెకరాల స్థలంలో ఇళ్లు, పాఠశాల, తాగునీరు, విద్యుత్, రోడ్లు వంటి సదుపాయాలు ఏర్పడ్డాయి. దీంతో తండాకు దివ్య గూడెంగా పేరు పెట్టారు. దహిగూడలో కలెక్టర్ రాజర్షిషా ఎకరం ప్రభుత్వ భూమిని కేటాయించడంతో 17 కుటుంబాలకు ఇళ్ల నిర్మాణం ప్రారంభమైంది. అక్కడికి రాజర్షిషా గూడెంగా నామకరణం చేశారు.