కాంగ్రెస్‌లో చేరి పెద్ద తప్పు చేశాను.. ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి హాట్‌కామెంట్స్‌.. .

7 months ago 23
పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం జీఎమ్మార్ (GMR) ఫంక్షన్ హాల్లో జరిగిన అనుచరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో కొన్ని పరిస్థితుల వల్ల తప్పటడుగు వేసి కాంగ్రెస్‌లో చేరానని.. దానివల్ల కనీసం వెంట్రుక వంతు కూడా లాభం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మూడుసార్లు తనను ఎమ్మెల్యేగా గెలిపించిన బీఆర్ఎస్ పార్టీ పట్ల కృతజ్ఞతగా.. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులనే గెలిపించాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని 5 మున్సిపాలిటీల్లోని 104 మంది కౌన్సిలర్లను గెలిపించేలా విభాగాల వారీగా కృషి చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
Read Entire Article