కాంగ్రెస్‌లో కొండా సురేఖ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఆమెకు ఢిల్లీ నుంచి పిలుపు రావడం కీలకంగా మారింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోపాటు.. కేసీ వేణుగోపాల్‌తోనూ కొండా సురేఖ భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటనతో కేబినెట్ విస్తరణ అంశంపైనా రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఇలాంటి తరుణంలో కొండా సురేఖ విషయంలో హైకమాండ్ చర్యలు తీసుకుంటుందా, లేక వివరణతోనే వ్యవహారాన్ని ముగిస్తుందా అనే చర్చ కొనసాగుతోంది.