మంగళగిరిలో జరిగిన వైసీపీ ప్లీనరీలో తనపై భౌతికంగా దాడి జరిగిందన్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. విజయసాయిరెడ్డి ఆరోపణలపై స్పందించిన సజ్జల రామకృష్ణారెడ్డి.. ఈ విషయంపై మాత్రం సమాధానం దాటవేశారు.ఈ నేపథ్యంలో అప్పట్లో వైసీపీలో ఉన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ విషయంపై స్పందించారు. మంగళగిరి ప్లీనరీ సమావేశంలో విజయసాయిరెడ్డిని, సజ్జల కొట్టింది నిజమేనని విలేకర్ల సమావేశంలో వెల్లడించారు.