గోదావరి పరివాహక ప్రాంతాలకు మంచిరోజులు వచ్చాయి. గోదావరి పుష్కరాల నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతాల్లోని గ్రామాలలో ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపడుతోంది. అందులో భాగంగా తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరో వంద కోట్లు విడుదల చేశారు. ఈ నిధులతో ఆయా గ్రామాలలో గ్రామీణ రహదారులు, తాగు నీటి సదుపాయాలు కల్పించనున్నారు. రూ.90 కోట్ల నిధులతో ఏడు నియోజకవర్గాల్లో రహదారుల అభివృద్ధి చేపట్టనున్నారు. తాగు నీటి సరఫరా కోసం ఆర్‌డబ్ల్యూఎస్ నుంచి మరో రూ.10 కోట్లు కేటాయించారు.