కాకినాడ: చిన్న ఉద్యోగికి అన్ని కోట్లలో ఆస్తులా?.. ఏసీబీ అధికారులు విస్తుపోయేలా!

1 month ago 14
Acb Raids In Senior Assistant Shiva Kumar In Kakinada District:ఆయన చేస్తున్న ఉద్యోగం కలెక్టరేట్‌లో సీనియర్‌ అసిస్టెంట్‌.. వయసు 36 ఏళ్లు.. ఆస్తులు చూస్తే కళ్లు చెదిరిపోతాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కాకినాడకు చెందిన చోడపురెడ్డి శివకుమార్‌ ఇంట అవినీతి నిరోధకశాఖ అధికారులు శుక్రవారం తనిఖీలు చేశారు. రూ.కోట్లాది స్థిర, చరాస్తులను కూడబెట్టినట్లు గుర్తించారు. కాకినాడలోని శివకుమార్, మామ చింతల శ్రీనివాసన్‌ ఇళ్లతో పాటు కలెక్టరేట్, చీడిగలోని అతని సోదరి నాగిశ సుష్మ ఫ్లాట్‌లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. శివకుమార్‌ దంపతుల పేరిట కాకినాడ, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో విలాసవంతమైన ఫ్లాట్లు, ఖరీదైన కార్లు, భారీగా బంగారం, వ్యవసాయ భూములున్నట్లు గుర్తించారు. ఇప్పటివరకు వారి పేరున రూ.8 కోట్లకు పైగా ఆస్తులున్నట్లు తేల్చారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయని అనిశా అధికారులు పేర్కొన్నారు.
Read Entire Article