కాకినాడ జిల్లాలో భారీ పేలుడు సంభవించింది. వేట్లపాలెం - జి. మేడపాడు మధ్యన ఉన్న బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు చోటుచేసుకుంది. సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ అనే బాణాసంచా తయారీ కేంద్రంలో మందుగుండు సామాగ్రి తయారు చేస్తున్న సమయంలో పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 18 మంది చనిపోయినట్లు సమాచారం. పేలుడు ధాటికి చుట్టుపక్కల ఇళ్లు దెబ్బతిన్నాయి. చుట్టుపక్కల గ్రామాలను సైతం పొగ కమ్మేసింది. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు,