హీరోయిన్ శ్రీలీల కాకినాడలో సందడి చేశారు. ఓ షాపింగ్ మాల్ కార్యక్రమంలో పాల్గొనేందుకు శ్రీలీల కాకినాడకు వచ్చారు. శ్రీలీల వస్తున్న విషయం తెలియటంతో షాపింగ్ మాల్ వద్దకు అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపించారు. భారీగా వచ్చిన అభిమానులతో షాపింగ్ మాల్ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. మరోవైపు ఇటీవల విడుదలైన అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాలో శ్రీలీల ఐటెం సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. శ్రీలీల కిస్సిక్ సాంగ్‌కు థియేటర్లలో విజిల్స్ మోత మోగుతోంది.