వెహికల్ కొంటున్నామంటే నెంబర్, రిజిస్ట్రేషన్ కోసం ఓనర్‌కి తల ప్రాణం తోకకి వచ్చేది. అయితే, ఇదంతా ఒకప్పుడు ఇప్పుడు అంతా ఈజీ ప్రాసెసే. టెక్నాలజీ పెరగడంతో ప్రభుత్వం కూడా దళారీ వ్యవస్థ గోల లేకుండా చేసేందుకు నేరుగా వెహికల్ డీలర్ ద్వారానే ఇకపై నెంబర్ సులభంగా తెచ్చుకోవచ్చని ప్రభుత్వం చెబుతోంది. డాక్యుమెంట్ల వెరిఫికేషన్, నెంబర్ కేటాయించేందుకు ఇకపై అధికారులు ఆలస్యం చేయడానికి కూడా వీలుండదు. ఒకవేళ కార్యాలయంలో ఆలస్యం చేసినా 24 గంటలు దాటిన తర్వాత నెంబర్ జనరేట్ అయినట్టు వాహనదారునికి మెసెజ్ వెళ్తుంది.