Chandragiri Road accident: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం భాకరాపేట కనుమ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టమాటో లోడుతో వెళ్తున్న కంటైనర్ లారీ ఒకటి.. అదుపుతప్పి ముందు వెళ్తున్న కారును, బైక్‌ను ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో లారీ కింద చిక్కుకొని కారు నుజ్జునుజ్జయ్యింది. కారులో ప్రయాణిస్తున్న వారిలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.