హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి విద్యను సామాన్యులకు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం భారీ ప్రణాళిక సిద్ధం చేసింది. ఔటర్ రింగ్ రోడ్డు లోపల 23 అత్యాధునిక ప్రభుత్వ పాఠశాలలు నిర్మించనున్నారు. వీటిలో ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒకే ప్రాంగణంలో విద్య అందుతుంది. కార్పొరేట్ స్థాయి విద్య ఉచితంగా లభించనుంది.