మాజీ మంత్రి రోజా.. ఎయిర్ ఇండియా సేవలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. డిసెంబర్ 2న తనకు ఎదురైన అనుభవాన్ని చెప్తూ.. ఎయిర్ ఇండియా సేవలపై అసహనం వ్యక్తం చేశారు. సర్వీసుల కోసం డబ్బులు చెల్లిస్తున్నప్పుడు తమకు కావాల్సింది గౌరవం కానీ అవమానం కాదంటూ ఘాటుగా ట్వీట్ చేశారు. అయితే రోజా ట్వీట్‌కు ఎయిర్ ఇండియా రిప్లై ఇచ్చింది. జరిగిన దానికి చింతిస్తున్నామన్న ఎయిర్ ఇండియా.. తమకు సమయం కేటాయిస్తే మాట్లాడుతామంటూ బదులిచ్చింది.