హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డు టోల్ వసూళ్లు చేసే నిర్వహణ సంస్థకు కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రతిరోజూ టోల్ ఛార్జీల రూపంలో దాదాపు రూ.2 కోట్ల వరకూ ఆదాయం వస్తోంది. 2023లో 30 ఏళ్ల కాలపరిమితితో ఐఆర్‌బీ అనే ప్రైవేటు సంస్థ లీజుకు తీసుకోగా.. గత 16 నెలల కాలంలోనే వెయ్యి కోట్లకు పైగా ఆదాయం వచ్చింది.