తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం నిలిపివేసింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో నంబర్ 9, ఎన్నికల నోటిఫికేషన్‌పై హైకోర్టు స్టే ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు.. సెప్టెంబర్ 29 నాటి గెజిట్‌ను నిలిపివేసి, రాష్ట్రవ్యాప్తంగా అమలులో ఉన్న ఎన్నికల కోడ్‌ను అధికారులు ఎత్తివేశారు. మరోవైపు.. ఈ న్యాయస్థానం ఉత్తర్వులపై బీసీ సంఘాల నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ, రాష్ట్ర బంద్‌కు హెచ్చరిక జారీ చేశారు.