కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. రాష్ట్రంలో ఆ దగ్గు మందు నిషేధం..

5 months ago 24
మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో 'కోల్డ్‌రిఫ్' దగ్గు సిరప్ సేవించిన కారణంగా 11 మంది చిన్నారులు మరణించడంతో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) అప్రమత్తమైంది. కిడ్నీ వైఫల్యానికి కారణమయ్యే డైథిలిన్ గ్లైకాల్ (DEG) కలుషితం ఉన్న SR-13 బ్యాచ్ సిరప్‌ను ఉపయోగించవద్దని డీసీఏ హెచ్చరించింది. రాష్ట్రంలోని మందుల దుకాణాలు, ఆసుపత్రులలో ఈ బ్యాచ్ సిరప్‌లను సీజ్ చేయాలని డ్రగ్ ఇన్‌స్పెక్టర్లను ఆదేశించింది. చిన్నారులకు మందు సిఫారసు చేసిన ఓ వైద్యుడిని మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Entire Article