హైదరాబాద్ శివారు రోడ్ల విస్తరణ కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.390 కోట్ల భారీ ప్రాజెక్టును ప్రకటించింది. ఇందులో భాగంగా.. మొత్తం 148.85 కిలోమీటర్ల పొడవైన రోడ్లను అద్భుతంగా మెరుగుపరచడానికి టెండర్లు పిలిచారు. ఈ ప్రాజెక్టును హామ్ పద్ధతిలో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా చేపట్టనున్నారు. ఈ విధానంలో నిర్మాణ వ్యయంలో కొంత భాగాన్ని ప్రభుత్వం నేరుగా భరిస్తుంది. ఈ విస్తరణ చర్య నగరానికి అనుసంధానంగా ఉన్న రోడ్ల నాణ్యతను పెంచి.. ట్రాఫిక్ రద్దీని తగ్గించడంలో సహాయపడుతుంది.