తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిపాలనలో కీలక సంస్కరణ చేపట్టింది. ఇటీవల 27 మున్సిపాలిటీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసిన నేపథ్యంలో.. వార్డుల సంఖ్యను 150 నుంచి 300కు పెంచుతూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం వల్ల భవిష్యత్తులో 300 మంది కార్పొరేటర్లు ఎన్నిక కానున్నారు. దీని ద్వారా పాలనా సౌలభ్యం మెరుగుపడి.. ప్రజలకు పౌర సేవలు మరింత వేగంగా అందుతాయని ప్రభుత్వం భావిస్తోంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తి కాగానే.. వార్డుల పునర్విభజన తర్వాత జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.