Tirupati Hubli passenger train cancelled: ప్రయాగ్ రాజ్ కుంభమేళాకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశం నలుమూలల నుంచి ఈ కుంభమేళాకు భక్తులు పోటెత్తనున్నారు. ఈ క్రమంలోనే భక్తుల కోసం రైల్వే అధికారులు కీలక చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడిచే పలు రైళ్లను కూడా కుంభమేళా కోసం పంపించనున్నారు. తిరుపతి - హుబ్లీ ప్యాసింజర్ రైలును కుంభమేళాకు పంపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. రెండు నెలల పాటు కుంభమేళాకు పంపించనున్నామని.. రైల్వే ప్రయాణికులు సహకరించాలని కోరింది.