మహబూబ్‌నగర్‌లో అత్యంత విషాదకరమైన సంఘటన ఒకటి వెలుగు చూసింది. ఓ వివాహిత తాను ఆత్మహత్య చేసుకోవడమే కాక.. ముక్కుపచ్చలారని బిడ్డను కూడా చంపేసింది. ఈ దారుణానికి కారణం కుక్క ఎంగిలి చేసిన ఆహారం తిన్నామా అనే అనుమానం. దీనిపై భర్త ఆరోపణలతో ఆమె మనోవేదనకు గురైంది. చివరికి ఆ భయంతోనే దారుణానికి ఒడిగట్టింది. తాను చనిపోవడమే కాక బిడ్డను కూడా బలి తీసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.