హైదరాబాద్ కూకట్‌పల్లికి చెందిన ఇద్దరు స్కూల్ విద్యార్థినిలు బుధవారం (నవంబర్ 20న) రోజున కనిపించకుండా పోయిన కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఇద్దరు బాలికలు స్కూల్ నుంచి నేరుగా ఏపీలోని బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్‌కు వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. ఇద్దరు సేఫ్‌గా ఉన్నారని తెలియటంతో.. బుధవారం రాత్రి నుంచి తీవ్ర ఆందోళన చెందిన ఆ బాలికల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు.. ఊపిరి పీల్చుకున్నారు.