హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా కూకట్‌పల్లిలో నల్ల చెరువు సమీపంలో అక్రమ ఇళ్ల కూల్చివేతలు చేపట్టింది. అయితే కూల్చివేతలను స్థానికులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థతి నెలకొంది. హైడ్రా సిబ్బందితో స్థానికులు వాగ్వాదానికి దిగారు. తమకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు పునరావాసం కల్పించలేదని బాధితుల ఆవేదన వ్యక్తం చేశారు.