Children Emotional Video: హైదారాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు (Hydra Demolitions ) ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కూల్చివేతలు నిర్వహించగా.. అందులో చాలా మంది సామాన్యులు తమ నివాసాలను కూల్చేశారు. కాగా.. బాధితుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ తమ గళాన్ని వినిపిస్తోంది. అటు క్షేత్రస్థాయిలో తిరుగుతూ బాధితులకు అండగా నిలుస్తుండగా.. అటు ట్విట్టర్‌లోనూ తీవ్ర స్థాయిలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే.. ఇద్దరు చిన్నారులకు సంబంధించిన ఓ వీడియోను పంచుకున్నారు కేటీఆర్.