Group 1 Aspirants Protest: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను రీషెడ్యూల్ చేయాలని కోరుతూ అభ్యర్థులు గత వారం రోజులుగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. అభ్యర్థుల ఆందోళనళకు కేంద్ర మంత్రి బండి సంజయ్ మద్దతు తెలిపారు. యువత చేస్తున్న ఆందోళనలో పాల్గొని.. విద్యార్థులతో మాట్లాడారు. చలో సెక్రటేరియట్‌కు పిలుపునిచ్చారు. విద్యార్థులతో ర్యాలీగా బయలుదేరిన బండి సంజయ్‌ను పోలీుసులు అడ్డుకున్నారు. మరోవైపు.. విద్యార్థుల ర్యాలీలో బీఆర్ఎస్ నేతలు కూడా పాల్గొనటంతో.. పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది.