Musi River Bed Victims: హైదరాబాద్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన.. మూసీ ప్రక్షాళన అంశంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన గడ్డం వెంకట స్వామి జయంతి కార్యక్రమంలో ప్రసంగించిన రేవంత్ రెడ్డి.. ఈ విషయంపై ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. మూసీ బాధితులకు న్యాయం చేసేందుకు ఓ కమిటీ వేద్దామని.. ఆ కమిటీలో బీఆర్ఎస్, బీజేపీ నేతలను పెడతామని.. అందరూ చర్చించి పేదలకు ఎలా న్యాయం చేయాలన్న సూచనలు చేయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.