Nalgonda Rythu Maha Dharna: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు పోలీసులు షాకిచ్చారు. నల్గొండలో కేటీఆర్ ఆధ్వర్యంలో రేపు (జనవరి 21న) నిర్వహించ తలపెట్టిన బీఆర్ఎస్ రైతు మహాధర్నాకు అనుమతి నిరాకరించి.. పోలీసులు చివరి నిమిషంలో ట్విస్ట్ ఇచ్చారు. దీంతో.. బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు తీర్పు ఇచ్చే వరకు రైతు మహా ధర్నాను వాయిదా వేస్తున్నట్టు బీఆర్ఎస్ తెలిపినట్టు సమాచారం.