తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. రేవంత్ రెడ్డి గతంలో చిప్పకూడు తిన్నాడు కాబట్టే.. ఇప్పుడు అందరికీ అదే తినిపించాలనుకుంటున్నాడని అన్నారు. కేటీఆర్ ప్రపంచం చూసి వచ్చినోడని.. కేటీఆర్‌కు, రేవంత్‌కు మధ్య అదే డిఫరెన్స్ అని చెప్రారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే తమపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు.