మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. గాంధీ కుటుంబంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ.. రేవంత్ రెడ్డికి భయపడే కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని ఆరోపించారు. తెలంగాణ కోసం గాంధీ కుటుంబం ఎంతో చేసిందని.. ఇప్పుడు వారిని విమర్శించడం సరికాదని జగ్గారెడ్డి విమర్శించారు. రాహుల్ గాంధీ గురించి మాట్లాడినందుకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.