కేసులకు భయపడొద్దు.. రేవంత్ సర్కార్‌కు చుక్కలు చూపిద్దాం: కేటీఆర్

1 day ago 1
ఎన్ని కేసులుంటే అంత పెద్ద లీడర్లు అవుతామంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రేవంత్ సర్కార్ పెట్టే కేసులకు ఏమాత్రం భయపడాల్సిన పనిలేదని పార్టీ శ్రేణులకు సూచించారు. హైదరాబాద్‌ బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో సోమవారం కార్మిక విభాగం (టీఆర్‌టీయూ) క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో 4 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయినా బీఆర్ఎస్ పార్టీకి పోరాట పటిమ తగ్గలేదని కార్మిక విభాగం నిరూపించిందన్నారు. ముఖ్యమంత్రి అయిన 15 రోజులకే కేసీఆర్ హమాలీలను పిలిచి మాట్లాడారన్నారు. కష్టం వచ్చినప్పుడే నాయకుడి విలువ తెలుస్తుందన్నారు. రేవంత్ రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తున్నారని.. క్షక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
Read Entire Article