తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. నేతలు ఒకరిపై ఒకరు ఘాటు విమర్శలు, సంచలన ఆరోపణలు చేస్తుండగా.. అవి కాస్త వివాదాలకు దారి తీస్తున్నాయి. ఈ క్రమంలోనే.. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు.. ప్రస్తుతం రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. కాగా.. ఆమె చేసిన ఆరోపణలపై మరోసారి స్పందించిన కేటీఆర్.. 100 కోట్లకు పరువు నష్టం దావా వేసినట్టు వెల్లడించారు. అయితే.. ఈ పిటిషన్ బుధవారం (అక్టోబర్ 22న) రోజున విచారణకు రానుంది.