Akkineni Nagarjuna: తెలంగాణలో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు అగ్గి రాజేస్తున్నాయి. అయితే.. అక్కినేని కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన దారుణమైన ఆరోపణలపై అటు తెలంగాణ రాజకీయాల్లోనూ.. ఇటు టాలీవుడ్‌లోనూ దుమారం రేపుతోంది. అయితే.. తన కుటుంబంపై చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన నాగార్జున.. కోర్టును ఆశ్రయించారు. కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు నాగార్జున. మంత్రిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో నాగార్జున పేర్కొన్నారు.