Konda Surekha: మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాలతో పాటు అటు టాలీవుడ్‌లోనూ తీవ్ర దుమారం రేపాయి. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను రాజకీయనేతలతో పాటు తెలుగు చిత్రసీమకు చెందిన ప్రముఖులు ముక్తకంఠంతో ఖండించారు. ఈ క్రమంలోనే.. కొండా సురేఖపై అధిష్ఠానం తీవ్ర ఆగ్రహంగా ఉందని.. వివరణ అడిగిందని.. మంత్రి పదవి నుంచి తప్పించనున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. కాగా.. ఈ వార్తలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ క్లారిటీ ఇచ్చారు.