సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో కీలక పరిణమాలు చోటుచేసుకుంటున్నాయి. కొడంగల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయబోతున్న ఫార్మా విలేజ్‌ను వ్యతిరేకిస్తూ.. అక్కడి రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఆ రైతులకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పాదయాత్ర చేపట్టారు. ఈ క్రమంలోనే.. పాదయాత్ర చేస్తున్న పట్నం మహేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహేందర్ రెడ్డితో పాటు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.