వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. కొడంగల్‌లో రైతుల నుంచి బలవంతంగా భూసేకరణ చేస్తున్నారని మండిపడ్డారు. కొడంగల్ రైతుల కోసం తాను న్యాయ పోరాటం చేస్తానని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత అల్లుడు మాక్స్బిన్ ఫార్మాసూటికల్ కంపెనీలో డైరక్టర్ అని, వీళ్లకు వందల, వేల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్నించారు. పాలకుల అవినీతిని బహిర్గతం చేయాలని లగచర్ల బాధితులకు పిలుపనిచ్చారు. రానున్న సర్పంచ్ ఎన్నికల్లో ఈ పార్టీలను చిత్తుగా ఓడించాలన్నారు.