ఏపీ మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్ గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో ఆయన చేరారు. గ్యాస్ట్రిక్ సమస్యతో చేరిన నానికి అక్కడి సిబ్బంది పలు డాక్టర్లు పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో గుండె సంబంధిత సమస్య ఉన్నట్లు గుర్తించారు. కొడాలి నానికి చికిత్స కొనసాగుతోంది. కొడాలి నాని ఆసుపత్రిలో చేరారనే సమాచారంలో వైఎస్సార్3సీపీ శ్రేణులు, ఆయన అనుచరులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు అధికారికంగా వివరాలను వెల్లడించాల్సి ఉంది.