Palamaner Kuppam National Highway 42 Works: చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పానికి కేంద్రం భారీగా నిధులు కేటాయించింది. పలమనేరు-కుప్పం రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరించడానికి రూ.1500 కోట్లు మంజూరు చేశారు. పరిశ్రమలు, విమానాశ్రయం నేపథ్యంలో పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. బైపాస్‌లు, ప్లైఓవర్లతో పాటు భూసేకరణ, పరిహారం పనులు కూడా చేపట్టనున్నారు. ఈ రోడ్డు విస్తరణతో ప్రయాణం మరింత సులభతరం అవుతుందని వాహనదారులు ఆశిస్తున్నారు.