తెలంగాణ జాగృతిని ఎన్జీవోగా మారుస్తున్నట్లు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఇక నుంచి ఎన్జీవోగానే కారక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. జెన్ జీ యువతే లక్ష్యంగా తన పార్టీ ముందుకు వెళ్తుందన్నారు. పేదలకు ఉచిత విద్య, వైద్యం, ఉద్యమకారులకు లక్ష ఉద్యోగాల హామీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి రిమోట్ కంట్రోల్ ఢిల్లీలో ఉందని ఎద్దేవా చేస్తూ.. ధాన్యం కొనుగోళ్లలో విఫలమైన ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు వెయ్యి రోజుల ప్రణాళికతో ముందుకెళ్తామని వెల్లడించారు.