సీనియర్ IAS అధికారిణి స్మితా సభర్వాల్ రాష్ట్ర యువజన అభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక కార్యదర్శిగా కొత్త బాధ్యతలు స్వీకరించారు. మెున్నటి వరకు తెలంగాణ ఫైనాన్స్ కార్పొరేషన్ మెంబర్ సెక్రటరీగా విధులు నిర్వహించిన ఆమెకు.. ఈ నెల 12న కొత్త పోస్టింగ్ కల్పించారు. కానీ మహారాష్ట్ర ఎన్నికల అబ్జర్వర్‌గా స్మిత అక్కడే ఉండగా.. అక్కడి నుంచి తిరిగి వచ్చిన వెంటనే బాధ్యతలు చేపట్టారు.