తెలంగాణలో కొత్త మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ప్రకారం రేపటి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. అక్టోబర్ 18వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ సారి టెండర్ ఫీజును భారీగా పెంచారు. గతంలో రూ.2 లక్షల వరకు ఉన్న ఫీజు ఈ సారి రూ.లక్ష పెంచుతూ రూ.3 లక్షలుగా ఫిక్స్ చేశారు. అయితే లైసెన్స్ ఫీజును ఆరు విడతలుగా చెల్లించేందుకు వెసులుబాటు కల్పించారు. మొత్తం 2670 మద్యం దుకాణాలు ఉండగా.. వీటిలో గౌడ్స్‌కు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వ్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.