రాప్తాడు ఘటనలో తీవ్రంగా గాయపడి బెంగళూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను మంత్రి నారా లోకేశ్ పరామర్శించారు. ఆమె ఆరోగ్యంగా కీలక అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం అమ్మాయి ఆరోగ్యం నిరలకడగా ఉందని, కాకపోతే రాబోయే 48 గంటలు చాలా కీలకమని అన్నారు. అలాగే బాధిత కుటుంబానికి జీవితాంతం అండగా ఉంటానని చెప్పారు. అలాగే పాఠశాలల్లో భద్రతను పెంచుతామన్నారు. దీంతోపాటు ఘటన జరిగిన స్కూల్ విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని, ఇది సంవత్సరం పాటు సాగుతుందని చెప్పారు.