Komuravelli Railway Station: కొత్త సంవత్సరంలో తెలంగాణ భక్తులకు శుభవార్త చెప్పబోతున్నారు రైల్వే అధికారులు. కొమురవెల్లి మల్లన్న పుణ్యక్షేత్రంలో నిర్మించిన కొత్త రైల్వే స్టేషన్ జనవరి రెండో వారంలో ప్రారంభం కానుంది. దసరాకే రావాల్సిన ఈ స్టేషన్, ఎన్నికల వల్ల వాయిదా పడింది. ఇకపై హైదరాబాద్, సికింద్రాబాద్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ నుంచి వచ్చే లక్షలాది మంది భక్తులకు రవాణా సౌకర్యం మెరుగుపడనుంది. రూ.3 కోట్లతో నిర్మించిన ఈ స్టేషన్, మల్లన్న దర్శనాన్ని మరింత సులభతరం చేస్తుంది.