కొత్త వాహనాలకు ఫ్యాన్సీ నంబర్లు కావాలనుకునే వారికి తెలంగాణ సర్కార్ షాక్ ఇచ్చింది. ప్రత్యేక నంబర్ల రిజర్వేషన్ ఫీజులను మూడు రెట్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యంగా 9999, 0009, 6666 వంటి నంబర్లకు ధరలు విపరీతంగా పెరిగాయి. ఈ పెంపుతో ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పెరుగుతుందని అంచనా. కాగా, ఆన్‌లైన్ దరఖాస్తు, వేలం విధానంలో ఎలాంటి మార్పు లేదు.