కోకాపేటలో ఎకరా రూ. 136.50 కోట్లకు బిడ్‌ వేసి చేతులెత్తేసిన బిల్డర్.. రూ.5 కోట్లు లాస్

3 weeks ago 12
హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌ రంగంలో సంచలనం సృష్టిస్తూ కోకాపేట ప్లాట్ నంబర్ 17లో 4.59 ఎకరాల భూమికి ఎకరాకు రూ. 136.50 కోట్ల చొప్పున బిడ్ వేసిన వజ్రా కన్‌స్ట్రక్షన్స్ చెల్లింపులు చేయలేకపోయింది. దీంతో వేలం నిబంధనల ప్రకారం హెచ్‌ఎమ్‌డీఏ సదరు సంస్థ చెల్లించిన రూ. 5 కోట్ల ఈఎమ్‌డీ డిపాజిట్‌ను జప్తు చేసింది. ప్రీ-లాంచ్ విక్రయాల ద్వారా నిధులు సమీకరించాలనే వ్యూహం ఫలించకపోవటంతో భూమితో పాటు డిపాజిట్‌నూ సదరు సంస్థ కోల్పోయింది. కాగా, ఈ భూమిని మళ్లీ వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Read Entire Article