కోకాపేట నియోపొలిస్‌లో 4.59 ఎకరాల ప్లాట్‌కు హెచ్‌ఎండీఏ నిర్వహించిన ఆన్‌లైన్ వేలానికి ఆశించిన స్పందన రాలేదు. కేవలం ఒక్క బిడ్ దాఖలవడంతో ఎకరాకు రూ.120 కోట్ల కనీస ధరకే ప్లాటు అమ్ముడుపోయింది. గత వేలంలో ఇదే భూమికి ఎకరాకు రూ.136 కోట్లు పలికినా.. బిడ్డర్ గడువులోపు డబ్బు చెల్లించకపోవడంతో మళ్లీ వేలం నిర్వహించారు. మరోవైపు గోల్డెన్ మైల్‌లోని 0.70 ఎకరాల ప్లాటుకు మాత్రం పోటీ పెరిగి ఎకరాకు రూ.115 కోట్ల అత్యధిక బిడ్ నమోదైంది.