సంక్రాంతి పండుగ వేళ ఏపీలో ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో కోడి పందేలు జోరుగా సాగాయి. ఈ క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరిగిన ఓ పందెంలో.. రాజమండ్రి రమేష్ అనే వ్యక్తి కోడి పందెంలో విజయం సాధించి బంపర్ ప్రైజ్ గెలిచాడు. ఏకంగా రూ. 1.53 కోట్లు గెలుచుకున్నాడు. ఈ ప్రాంతంలో ఈ ఏడాది ఇదే అతిపెద్ద పందెంగా స్థానికులు చెబుతున్నారు. కాగా, ఈ ఏడాది జరిగిన కోడి పందేల్లో రూ. కోట్లు చేతులు మారినట్లు తెలుస్తోంది.