పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు పోలీస్ స్టేషన్ కోడిపుంజులతో నిండిపోయింది. కోడిపుంజుల కొక్కొరొక్కో శబ్ధాలతో ఆకివీడు పోలీస్ స్టేషన్ మార్మోగింది. దీంతో స్టేషన్‌కు వచ్చిన వారంతా ఈ దృశ్యాన్ని ఆసక్తిగా గమనించారు. అయితే గత కొంతకాలంగా ఈ ప్రాంతంలో కోడిపుంజుల చోరీలు జరుగుతున్నాయి. దీనిపై కోడిపుంజుల పెంపకందారులు ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణ చేపట్టిన పోలీసులు ఓ దొంగను అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి 27 కోడిపుంజులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఇలా స్టేషన్‌లో ఉంచారు.